ఎం.ఆర్‌. రాధా బయోపిక్‌

4 Jan, 2020 00:42 IST|Sakshi
ఎం.ఆర్‌ రాధ, రాధిక

ఎం.ఆర్‌ రాధ... తమిళంలో పాపులర్‌ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్‌ మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట.

మరిన్ని వార్తలు