నేను సేఫ్‌గా చేరుకున్నా: హీరోయిన్‌

19 Mar, 2020 10:29 IST|Sakshi

భారత్‌లో కరోనా తీవ్రత అధికమవుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తారల సంగతి సరేసరి... షూటింగ్స్‌కు నో చెప్పి ఇంట్లో నుంచి బయట కాలు మోపడం లేదు. ఇక దక్షిణాది కన్నా బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న హీరోయిన్‌ రాధికా ఆప్టే తాజాగా ఇండియాకు వచ్చింది. వచ్చిన పని ముగియగానే తిరుగు ప్రయాణమై లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో దిగింది.. అసలే కరోనా భయంతో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రకరకాల పరీక్షల పేరిట ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాధికాకు విమానాశ్రయంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో, ఎంత అసౌకర్యానికి లోనైందోనని ఆమె అభిమానులు, బంధువులు కాస్త కలవరపాటుకు లోనయ్యారు. దీనిపై రాధికా స్పందిస్తూ తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. (బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!)

‘స్నేహితులు, బంధువుల నుంచి నాకు ఎన్నో మెస్సేజ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. మీరు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు. నేను లండన్‌లో క్షేమంగా దిగాను. అక్కడ నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయం అంతా నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. నిజానికి లండన్‌ నుంచి భారత్‌కు వెళ్లే ఫ్లైట్‌లో అసలు జనాలే లేరని, కానీ అక్కడి నుంచి లండన్‌కు తిరిగొచ్చే విమానం మాత్రం జనాలతో కిక్కిరిసిపోయిందని తెలిపిందీ మరాఠీ భామ. కరోనా ఎఫెక్ట్‌తో తన బిజీ షెడ్యూల్‌కు విరామం ఇచ్చి సామాజిక దూరాన్ని పాటించేందుకు సిద్ధమైనట్లు తన లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా తెలుస్తోంది. (నా సక్సెస్‌ భిన్నం బాస్‌)

#Golden #lastdayofwork #socialdistancingstartstomorrow

A post shared by Radhika (@radhikaofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా