అవార్డు నిల్‌... ఆకర్షణ ఫుల్‌

27 Nov, 2019 00:54 IST|Sakshi

‘ఎమ్మీ అవార్డులకు నామినేషన్‌ దక్కించుకున్నానోచ్‌’ అంటూ ఇటీవల రాధికా ఆప్టే ప్రకటించారు. నామినేషన్‌ పత్రాన్ని అందుకుని, రాధిక న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడే 47వ ‘ఎమ్మీ’ అవార్డుల వేడుక జరిగింది. టీవీ షోలు, సీరియల్స్‌కి అవార్డుల ప్రదానం చేస్తుంటుంది ‘ఎమ్మీ’. ‘లస్ట్‌ స్టోరీస్‌’కి గాను ఉత్తమ నటన విభాగంలో రాధికా ఆప్టేని నామినేట్‌ చేశారు అవార్డు సంస్థ ప్రతినిధులు. ఇంకా మన దేశం నుంచి సైఫ్‌ అలీఖాన్, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించిన ‘సేక్రెడ్‌ గేమ్స్‌’, మరో సిరీస్‌ ‘ది రీమిక్స్‌’ నామినేషన్‌ దక్కించుకున్నాయి.

‘లస్ట్‌ స్టోరీస్‌’ దర్శకులు కరణ్‌ జోహార్, జోయా అక్తర్, అనురాగ్‌ కశ్యప్, దిబాకర్, నటి రాధికా ఆప్టే ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అలాగే ‘సేక్రెడ్‌ గేమ్‌’ నుంచి, ‘ది రీమిక్స్‌’ నుంచి కొందరు అవార్డు వేడుకకు వెళ్లారు. మొత్తం 21 దేశాల నుంచి 11 విభాగాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నామినేట్‌ అయ్యారు. మనదేశం నుంచి నామినేట్‌ అయినవాటికి అవార్డులు నిల్‌ కానీ అవార్డు వేడుకలో రాధికా ఆప్టే అట్రాక్షన్‌ మాత్రం ఫుల్‌ అని నెటిజన్లు పేర్కొన్నారు. అయితే నవాజుద్దీన్‌ నటించిన ‘మెక్‌ మాఫియా’ అనే ఇంగ్లిష్‌ టీవీ సిరీస్‌కి అవార్డు దక్కింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా