ఆయనతో హిమాలయాలకు..!

15 Jun, 2015 23:32 IST|Sakshi
ఆయనతో హిమాలయాలకు..!

‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ తదితర చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టేకు తెలుగు నాట మంచి హోమ్లీ ఇమేజ్ ఉంది. కానీ, బాలీవుడ్‌లో ఆమెకు దీనికి పూర్తి భిన్నమైన ఇమేజ్ ఉంది. ‘బద్లాపూర్’ చిత్రంలో అర్ధనగ్నంగా నటించి, ‘రాధికా ఇలా కూడా నటిస్తుందా?’ అని చాలామంది అనుకునేలా చేశారామె. ఆ తర్వాత ఓ డాక్యుమెంటరీ మూవీలో నగ్నంగా నటించి, షాకిచ్చారు. ఈ అర్ధనగ్న, నగ్న దృశ్యాల ద్వారా రాధిక ఈ మధ్య వార్తల్లో నిలిచారు.
 
  ఎక్కడికెళ్లినా ఆమెను వీటి గురించే అడుగుతున్నారు. ఈ తతంగంతో రాధికా విసిగిపోయారట. దాంతో కొంచెం సేద తీరాలనుకున్నారో ఏమో... ఆయనగారితో హిమాలయాలకు చెక్కేశారు. ఆయనగారు ఎవరు? అని ఊహల్లోకి వెళ్లకండి. ఆయన స్వయంగా రాధికా భర్తే. మూడేళ్ల క్రితం బ్రిటిష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు రాధిక. అడపా దడపా ఆయన రాధిక నటించే చిత్రాల లొకేషన్స్‌లోనూ కనిపిస్తుంటారు. ఆ సంగతలా ఉంచితే.. ‘‘మంచు కొండలకు వెళ్లడం భలే ఆనందంగా ఉంది. కొండలంటే నాకు చాలా ఇష్టమండీ బాబూ’’ అంటున్నారు రాధికా ఆప్టే.