హాలీవుడ్ చిత్రంలో...

2 Mar, 2015 03:21 IST|Sakshi
హాలీవుడ్ చిత్రంలో...

 ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ప్రస్తుతం ‘లయన్’లో నటిస్తున్నారు. మరోవైపు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న రాధికా ఆప్టేని ఓ హాలీవుడ్ ఆఫర్ వరించింది. ఎంటీవీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పలు లఘు చిత్రాల సమాహారంతో సాగుతుంది. ఈ లఘు చిత్రాలకు అంతర్జాతీయంగా పేరు, ప్రఖ్యాతులు సాధించిన ఏడుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తారు. వారిలో హిందీ రంగానికి చెందిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉండటం విశేషం.