ఆ విషయం చాలా మందికి తెలియదు!

8 Feb, 2019 12:00 IST|Sakshi

సినిమా: సంచలనాలకు పేటెంట్‌ తారలు కొందరుంటారు. అలాంటి వారిలో నటి రాధికాఆప్తే మొదటి వరుసలో ఉంటారని చెప్పవచ్చు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తున్న బహుభాషా నటిగా రాణిస్తోంది. తరచూ అందాలారబోత ఫొటోలను సోషల్‌మీడియాకు విడుదల చేయడం, ఆరోపణలు చేయడం ఈ అమ్మడికి పరిపాటి. విషయం తక్కువ, చేసే హంగామా ఎక్కువ అంటారే! అలాంటి నటి రాధికాఆప్తే. చేసిన చిత్రాలు తక్కువ, వార్తల్లో ఉండేది ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక అంశంతో, ఎవరినో ఒకరిపై ఆరోపణలు చేసే ఈ అమ్మడు ఈ సారి తన వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ అలా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పెళ్లి, భర్త, సంసార జీవితం వంటి అంశాలను తన ప్రచారానికి వాడుకుంది. బాలీవుడ్‌ నటి నటి రాధికాఆప్తే. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది లండన్‌కు చెందిన సంగీత కళాకారుడు పెండిక్ట్‌ టెయిలర్‌.

ఈ జంట పెళ్లి 2012లోనే పెళ్లి చేసుకున్నారు. భర్త లండన్, మీరు ముంబై ఎలా వర్కౌట్‌ అవుతుందన్న ప్రశ్నకు నటి రాధికాఆప్తే ఏం చెప్పుకొచ్చిందో చూద్దాం. దూరంగా ఉన్నా,దగ్గర ఉన్నా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడం సహజం. అందుకు మేమూ అతీతం కాదు. నేను, నా భర్త ఒకరిపై ఒకరం ప్రేమను పెంచుకున్నాం. ఇద్దరి మధ్య గొడవ జరిగితే నీతో మాట్లాడడం నాకిష్టం లేదు అని చెప్పుకుంటాం. అదీ కాసేపే. ఆ తరువాత మళ్లీ కలిసిపోతాం. తప్పెవరు చేసినా ఇద్దరం సారీ చెప్పేసుకుంటాం. గొడవ పడినప్పుడు ఎక్కువ సమయం మాట్లాడకుంటే సమస్య పెద్దదవుతుంది. అందుకే మేము గొడవ పడ్డా దాని సెగ కొంత సేపే. ఆ తరువాత దాన్ని మరిచిపోతాం. నాకు నా భర్తకు మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవు. నువ్వు నాకు ప్రాధాన్యత నివ్వడంలేదు అని ఎప్పుడూ అనుకోలేదు. 8 ఏళ్లుగా ఒక్కసారి కూడా అలాంటి ప్రస్తావన తమ మధ్య రాలేదు. 8 ఏళ్ల ముందు ఏర్పడిన మా పరిచయం పెళ్లికి దారి తీసింది. అయినా ఇప్పటికీ నాకు పెళ్లి అయిన విషయం చాలా మందికి తెలియదు. అయితే నేను మాత్రం ఈ విషయాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. మాది రిజిస్టర్‌ మ్యారేజ్‌. పెళ్లి చేసుకున్నామో, లేదో. ఏదైనా నిజాయితీగా ఉండడం ముఖ్యం అని నటి రాధికాఆప్తే పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు