సిగ్గు పడటంలేదు!

6 Oct, 2016 07:37 IST|Sakshi
సిగ్గు పడటంలేదు!

కళ్లు ఎరుపెక్కాయి.. కోపంతో పెదాలు అదిరాయి.. మాటల్లో కారాలు-మిరియాలు నూరినంత ఘాటు.. ఆగ్రహంతో రగిలిన రాధికా ఆప్టే ముంబైలో ఓ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ‘పార్ష్‌డ్’ సినిమాలో నుంచి లీకైన నగ్న దృశ్యాల గురించి ప్రశ్నించినందుకు కోపంతో రగిలిపోయారు. ‘‘మై ఫ్రెండ్... సారీ! మీలాంటి వ్యక్తులే ఈ వివాదాలను సృష్టిస్తారు. మీరు ఆ క్లిప్ (లీకైన న్యూడ్ సీన్) చూశారు. ఫ్రెండ్‌కి షేర్ చేశారు.

కాంట్రవర్సీకి కారణమయ్యారు’’ అని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్ష్‌డ్’లో ఆదిల్ హుస్సేన్, రాధికా ఆప్టే నటించిన న్యూడ్ సీన్ ఇండియాలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. న్యూడ్ సీన్‌లో నటించడం నటనలో ఓ భాగమన్న రాధిక.. ‘‘నేను దేనికీ సిగ్గు పడడం లేదు. నా క్లిప్ చూడడం కంటే అద్దంలో మీరు మీ నగ్నదేహాన్ని చూసుకోండి. ఎవరైతే వాళ్ల దేహాన్ని భరించలేరో వాళ్లే ఇతరుల దేహంపై దృష్టి పెడతారు’’ అన్నారు.