అమితాబ్‌ బాటలో రాధిక కానీ..

17 Oct, 2019 20:46 IST|Sakshi

వెండితెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో.. బుల్లి తెర మీద కూడా అదే స్థాయిలో అభిమానులను అలరించారు సీనియర్‌ నటి రాధిక శరత్‌కుమార్‌. ఇన్ని రోజుల్లో టీవీ సీరియల్స్‌తో అలరించిన త్వరలో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) విశేష ఆదర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళంలో కేబీసీ మాదిరి ‘కోడీశ్వరి’(కోటీశ్వరి) గేమ్‌ షోను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్విజ్‌ షోకు రాధిక హోస్ట్‌గా ఉండనున్నారు. అయితే కేబీసీలో మహిళలకు, పురుషులకు అవకాశం కల్పించగా.. కోడీశ్వరిలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనేందకు అవకాశం కల్పించారు. ఈ షో కలర్స్‌ తమిళ్‌ చానల్‌లో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించి రాధిక లుక్‌తో కూడిన చిన్న టీజర్‌ను ఆ చానల్‌ విడుదల చేసింది. కాగా, ఈ షో డిసెంబర్‌ నుంచి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తోంది.

అయితే కేబీసీ ఆధారంగా తమిళంలో ఇదివరకే  ‘నీంగలుమ్‌ వెల్లాలుమ్‌ ఒరు కోడీ’పేరుతో ఓ షో ప్రసారం అయింది. మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షోకు సూర్య, ప్రకాశ్‌రాజ్‌, అరవింద్‌స్వామిలు ఒక్కో సీజన్‌లో హోస్ట్‌లుగా వ్యవహరించారు. పలు భారతీయ భాషల్లో కూడా కేబీసీ ఆధారంగా ఇప్పటికే షోలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రెగ్నెంట్‌ లేడీగా కీర్తీ సురేష్‌

విడాకులపై స్పందించిన మంచు మనోజ్‌

అందుకే ‘దోస్తానా-2’కు నో చెప్పాను!

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

విక్రమ్‌తో కేజీఎఫ్‌ హీరోయిన్‌?

ఆయన మాత్రమే బాకీ..

బాలు పాట హైలైట్‌

గ్యాంగ్‌స్టర్‌ గంగూభాయ్‌

మలుపుల సరోవరం

పల్లెటూరి ప్రేమకథ

రొమాంటిక్‌లో గెస్ట్‌

దేశభక్తిని రగిలించే చిత్రం ‘సైరా’

నేనీ స్థాయిలో ఉండటానికి కారణం నా తమ్ముళ్లే

ఏడాది చివర్లో పండగ

నవ్వుల కీర్తి

రేస్‌ మొదలు

ఈ కాంబినేషన్‌ కొత్తగా ఉంది

అందుకే ఆయనతో సహజీవనం చేయలేదు : దీపిక

‘మేమిద్దరం ఇప్పుడు రాజకీయాలు వదిలేశాం’

ఆ చూపులకు అర్థం నాకు తెలుసు: రణ్‌వీర్‌

ప్రతి ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగా ఒక సీక్రెట్‌ ఉంటుంది

వెంకయ్య నివాసంలో ‘సైరా’ స్పెషల్‌ షో

28 ఏళ్ల జస్లీన్, 65 ఏళ్ల జలోటా మధ్య ఏముంది?

‘నా డ్రీమ్‌ 18న చూడబోతున్నారు’

థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ

ఆల్కహాలిక్‌ కామెంట్లపై శృతి వివరణ

‘రొమాంటిక్’లో రమ్య‌కృష్ణ‌

అలాంటి సినిమాలు ప్రభాస్‌ అన్నే చేయాలి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రెగ్నెంట్‌ లేడీగా కీర్తీ సురేష్‌

అమితాబ్‌ బాటలో రాధిక కానీ..

విడాకులపై స్పందించిన మంచు మనోజ్‌

అందుకే ‘దోస్తానా-2’కు నో చెప్పాను!

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’