24 గంటల్లో...

22 Sep, 2019 03:07 IST|Sakshi
సత్యదేవ్, ఈషారెబ్బా

‘అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, బొమ్మన బ్రదర్స్‌ చందన సిస్టర్స్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించారు దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి. వినోదాత్మక చిత్రాలే కాదు.. నాగార్జునతో ‘ఢమరుకం’ వంటి సోషియో ఫాంటసీతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషారెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రల్లో నటించారు.

శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 25న, చిత్రాన్ని అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు. శ్రీనివాస్‌ కానూరు మాట్లాడుతూ– ‘‘స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన రెండు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు, దర్శకుడు వీవీ వినాయక్‌ చేతుల మీదుగా విడుదలైన మోషన్‌ పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్‌ మా చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయన రాసిన మాటలు, రఘుకుంచె నేపథ్య సంగీతం, ‘గరుడ వేగ’ ఫేమ్‌ అంజి కెమెరావర్క్‌ సినిమాకి హైలెట్‌’’ అన్నారు. కృష్ణభగవాన్, రవిప్రకాశ్, రవివర్మ, ‘టెంపర్‌’ వంశీ, అజయ్, అనురాగ్‌ తదితరులు నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు