కరోనాపై పోరు.. లారెస్స్‌ భారీ విరాళం

9 Apr, 2020 20:11 IST|Sakshi

చెన్నై : క‌రోనాపై పోరుకు అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తున్నారు. మేము సైతం అంటూ చేయూత‌నందిస్తున్నారు. డాన్స‌ర్‌గా ఇండస్ట్రీలోకి వ‌చ్చి, న‌టుడిగా మారి..కొరియాగ్ర‌ఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు రాఘ‌వ‌లారెన్స్‌. క‌రోనా బాధితుల‌కు త‌న‌వంతు సాయంగా 3 కోట్ల రూపాయ‌ల విరాళాన్నిఅందిస్తున్న‌ట్లు తెలిపాడు. ఇందులోంచి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు, ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు, డాన్సర్స్ అసోషియేషన్‌కు రూ.  50 లక్షలు, సినిమా కార్మికులకు రూ. 50 లక్షలు, వికలాంగులకు రూ. 25 లక్షలు, తన సొంత ఊరు రాయ‌పురం వాసుల‌కు రూ. 75 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. 

ప్రముఖ ద‌ర్శ‌కుడు పి. వాసు డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న చంద్ర‌ముఖి-2 సినిమాలో తాను కూడా భాగం కావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపాడు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ సినిమాలో న‌టించేముందు ర‌జినీకాంత్ ఆశిర్వాదం తీసుకున్నాన‌ని చెప్పారు లారెన్స్‌. తాను విరాళంగా ఇస్తోన్న 3 కోట్ల రూపాయ‌లు  చంద్ర‌ముఖి-2 కోసం తాను అందుకున్న అడ్వాన్స్ డ‌బ్బుల‌ని వెల్ల‌డించాడు. కాంచ‌నా సినిమాకు రీమెక్‌గా  ల‌క్ష్మీబాంబ్ పేరుతో బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని డెరెక్ట్ చేస్తున్నారు లారెన్స్‌.  అక్ష‌య్‌కుమార్‌,కియారా అద్వానీ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి లారెన్స్‌ మొద‌ట త‌ప్పుకున్నా అక్ష‌య్ జోక్యంతో నిర్మాత‌తో ముదిరిన వివాదం స‌ద్దుమ‌ణిగింది.


 

మరిన్ని వార్తలు