ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌కు అవార్డు..

22 Dec, 2017 09:06 IST|Sakshi

సాక్షి, పెరంబూరు: హాస్యనటుడు వివేక్, నృత్యదర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌ ప్రముఖులు ఉళవే తలై అవార్డులను అందుకోనున్నారు. రైతులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో తమిళ సంస్కృతి, రైతుల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఇందిర ఆగ్రోటెక్‌ సంస్థ తొలిసారిగా ఉళవే తలై పేరుతో అవార్డును ప్రవేశపెడుతోంది. రైతుల అభివద్ధిని కాంక్షించే, వారిని ఆదుకునే, అండగా నిలిచే సామాజిక సేవల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును అందించినున్నారు.

రైతులకు అదుకునే వారిని సత్కరించాలనే ఉద్దేశంతో నెల కొల్పినట్లు ఇందిర ఆగ్రోటెక్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక శనివారం సాయంత్రం స్థానిక చేపాక్కం, స్వామి శివానంద రోడ్డులోని అన్నా ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు. తమిళనాడు గవర్నమెంట్‌ ఎంప్లాయర్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షురాలు తమిళ్‌సెల్వి, దూరదర్శన్‌ పొదిగై ప్రోగ్రామింగ్‌ డైరెక్టర్‌ ఆండాళ్‌ ప్రియదర్శన్, ఇందిర గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ భూపేశ్‌నాగరాజన్‌ పాల్గొననున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖా మంత్రి కే.పాండియరాజన్‌ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

అదే విధంగా ప్రత్యేక అతిథులుగా సినీ దర్శకుడు కే.భాగ్యరాజ్, తంగర్‌బచ్చన్, అబ్దుల్‌ కలాం ఆలోచనకర్త పొన్‌రాజ్‌ వెళ్‌లైస్వామి పాల్గొననున్నారు. ఇక ఈ అవార్డులను సేనాపతి కంగయమ్‌ కాట్టిల్‌ రిచర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు కార్తికేయ శివసేనాపతి, సీనియర్‌ హాస్య నటుడు వివేక్, నృత్యదర్శకుడు, నటుడు సామాజిక సేవకుడు రాఘవలారెన్స్, తమిళనాడు వీర విళైయాట్టు మీట్పు కళగం కోఆర్డనేటర్‌ రాజేశ్, సీడీఎంఎంఎఫ్‌పీఓ చైర్మన్‌ ఎల్‌.రవిచంద్రన్, అగ్రికల్చర్‌ ఎక్స్‌పర్ట్‌ పామైయన్, ఎఫ్‌ఐబీ, సోల్‌ లైఫ్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సీఈఓ కవిత సాయిరామ్, జల్లికట్టు ఆక్టివిటీస్‌ ఆర్గనైజేషన్‌ ఎస్‌.రాజేశ్, ఇండియన్‌ సాయల్‌బయాలజిస్ట్, ఎకోలజిస్ట్‌ సుల్లాన్‌ అహ్మద్‌ ఇస్మాయిల్‌ ఉళవే తలై అవార్డును అందుకోనున్నారని నిర్వాహకులు తెలిపారు.  
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు