తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!

3 Oct, 2019 12:00 IST|Sakshi

సైరా నరసింహారెడ్డి’.. ప్రస్తుతం మెగాస్టార్‌ అభిమానులకు ఈ పేరే ఒక ఎమోషన్‌గా మారిపోయింది. గాంధీ 150వ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు వెళుతోంది. దాదాపు ఒకటో రెండో తప్ప మిగతా సంస్థలన్నీ సైరా సినిమాపై మంచి రివ్యూలనే అందించాయి. తాజాగా ఈ చిత్రంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో తనకు తెలిసిన చిరంజీవిగా కాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగానే కనిపించాడన్నారు.

మెగాస్టార్‌ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారన్నారు. ఈ సందర్భంగా సైరా టీంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సైరా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలుస్తుందని రాఘవేంద్రరావు కితాబిచ్చారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో తమన్నా నటన అదరగొట్టిందన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్‌చరణ్‌ ఈ చారిత్రాత్మక చిత్రంతో తండ్రికి అసలు సిసలైన గిఫ్ట్‌ ఇచ్చారని రాఘవేంద్రరావు కొనియాడారు.

కాగా సైరా హిట్‌తో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. ఈ మేరకు సంతోష క్షణాలతో కూడిన ఫొటోలను సాయి ధరమ్‌ తేజ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.. ‘చిరంజీవి అల్లుడిగా కాకుండా ఆయన అభిమానిగా చెప్తున్నా.. వెండితెరపై ఆయన మ్యాజిక్‌ చేశారు’ అంటూ చిరు నటనను కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించారని  సాయి ధరమ్ తేజ్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా