దర్శకేంద్రుడి క్లాస్ రూమ్

25 Feb, 2016 16:06 IST|Sakshi
దర్శకేంద్రుడి క్లాస్ రూమ్

ఇన్నాళ్లు దర్శకుడిగా ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు మరో అవతారంలో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటి వరకు మెగాఫోన్ పట్టుకొని సినిమా షాట్ల గురించి మాత్రమే చెప్పిన రాఘవేంద్రుడు త్వరలో దర్శకత్వ పాఠాలు చెప్పడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడిగా సంచలన విజయాలు నమోదు చేసిన ఈ దిగ్థర్శకుడు తనలాంటి మేటి దర్శకులను తయారు చేసే పనిలో ఉన్నాడు.

ఇందుకు సంభందించిన ఓ ప్రమోషన్ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాఘవేంద్ర రావు మరిన్ని వివరాల కోసం వేచిచూడాలంటూ ఊరిస్తున్నాడు. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్స్ను తయారు చేసిన దర్శకేంద్రుడు ఇప్పుడు ఏకంగా స్కూలు పెట్టి మరి దర్శకులను తయారు చేయటం ఇండస్ట్రీకి శుభ పరిణామంఅంటున్నారు విశ్లేషకులు.