‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’

17 Apr, 2020 12:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై పోరాటంలో భాగంగా అలుపెరగకుండా శ్రమిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ద్య సిబ్బందికి యావత్‌ ప్రపంచం సలామ్‌ చేస్తోంది. ఇప్పటికే వారి సేవలను కొనియాడుతూ అనేక మంది సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా నియంత్రణకు పోలీసులు చేస్తున్న నిస్వార్థ సేవకు సెల్యూట్‌ చేస్తూ టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ రఘు కుంచె తాజాగా ఓ పాటను రూపొందించారు. ‘సలాం నీకు పోలీసన్నా.. రెండు చేతులెత్తి నీకు మొక్కాలన్నా’అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. బండి సత్యం సాహిత్యం అందించగా రఘు కుంచె స్వయంగా ట్యూన్‌ కట్టి ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

‘నేను హైదరాబాద్ లో ఉంటాను. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో.. ఎవరి భయాలు వారికున్నట్టే నాకూ ఉన్నాయి. ఇంట్లో ఉంటూ నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. కానీ అవసరాలకోసం బయటికొచ్చినప్పుడు, మనకోసం లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న పోలీసులను చూస్తే వారి మీద గౌరవం రెట్టింపు అవుతోంది. టీవీల్లో వాళ్ల్లు చేస్తున్న కృషి గురించి, వాళ్ళు తీసుకుంటున్న రిస్క్ గురించి, ప్రజల కోసం వాళ్ళు పడుతున్న తపన చూస్తే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తోంది. అందుకే వారి  కోసం.. ఈ పాట’అంటూ రఘు కుంచె పేర్కొన్నాడు. ఇప్పటికే పోలీసుల సేవలను కొనియాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండలు పలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. 

చదవండి:
మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌
లాక్‌డౌన్‌: భారీ ర్యాలీ అని భ్రమపడేరు!
దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు