కమింగ్‌ సూన్‌!

29 Jun, 2018 00:14 IST|Sakshi
వరుణ్‌ తేజ్‌

శాటిలైట్‌ గ్రౌండ్‌ స్టేషన్‌లో ఉన్నారు వరుణ్‌ తేజ్‌. అక్కడ ఏం చేస్తున్నారంటే మాత్రం వెండితెరపై చూడాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లావణ్యా త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ కథానాయికలు. రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు  జాగర్లమూడి నిర్మిస్తున్నారు. వరుణ్, అదితీ అస్ట్రోనాట్స్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీటైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం స్పెషల్‌గా వేసిన శాటిలైట్‌ గ్రౌండ్‌ స్టేషన్‌లో షూటింగ్‌ జరగుతోందని సమాచారం. మరో పది రోజుల్లో ఈ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న నటుడు రెహ్మాన్‌ స్పేస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌గా కనిపిస్తారట. వచ్చే నెలలో టైటిల్‌ అండ్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఫస్ట్‌లుక్‌ కమింగ్‌ సూన్‌ అన్నమాట. సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ ఆర్‌. విహారి స్వరకర్త.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా