బికినీ సుందరి!

22 Mar, 2017 01:28 IST|Sakshi
బికినీ సుందరి!

నటీమణులు బికినీ దుస్తులు ధరించడానికి ఒకప్పుడు భయపడేవారు. ముఖ్యంగా ప్రముఖ కథానాయికలు తమ ఇమేజ్‌కి భంగం కలుగుతుందేమోనని ఈత దుస్తులు ధరించడానికి ససేమిరా అనే వారు. ఇక టూపీస్‌ దుస్తులు నర్తకీమణులే ధరించి అంగాంగ ప్రదర్శనలతో కుర్రకారును ఉర్రూతలూగించేవారు. అయితే ఈ సంస్కృతి రానురాను కథానాయకిలకు పాకింది. బికినీలు ధరించడానికి హీరోయిన్లు అధిక పారితోషికం డిమాండ్‌ చేసేవారు. అలాంటిది ఇప్పుడు ప్రముఖ హీరోయిన్లే ఐటమ్‌ గర్ల్‌గా మారిపోతున్నారు. అజిత్‌ బిల్లా చిత్రంలో నేటి టాప్‌ హీరోయిన్‌ నయనతార, సంచలన నటి నమిత ఈత దుస్తుల్లో పోటీ పడి కనిపించారు. ఆ తరువాత అలాంటి సన్నివేశాల్లో హీరోయిన్లు నటించడం అన్నది చాలా సర్వసాధారణం అయ్యిందనే చెప్పాలి.

నటి రాయ్‌లక్ష్మీ విషయానికి కొస్తే ఒకప్పుడు హీరోయిన్‌. ఇప్పుడు ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా మారిపోయారు.అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తన కెరీర్‌ను బిజీగా ఉండేలా చూసుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ మధ్య తెలుగులో చిరంజీవితో సింగిల్‌ సాంగ్‌కు చిందేసిన రాయ్‌లక్ష్మి తనను తాను ప్రమోట్‌ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి సందర్భం వస్తే మాత్రం చక్కగా ఉపయోగించుకుంటుందీ భామ. తాజాగా రాయ్‌లక్ష్మి నటిం చిన హిందీ చిత్రం జూలీ–2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

అందులో అమ్మడు అందాలారబోతలో ఇరగదీసిందట. టూపీస్‌ దుస్తుల్లో రకరకాల భంగిమల్లో స్విమ్‌ చేసి యువతను గిలిగింతలు పెట్టనుందట.  జూలీ–2 చిత్ర ప్రచారంలో భాగంగా రాయ్‌లక్ష్మీనే స్వయంగా టూపీస్‌ దుస్తులు ధరించిన తన ఫొటోను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడా ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. యువత అధికంగా లైక్‌ చేయడమే కాకుండా ఇతర హీరోయిన్ల ఈత దుస్తుల ఫొటోలను కూడా ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసి ఏ నటి టాప్‌ అనే కాంటెస్ట్‌ను కూడా నిర్వహిస్తుండడం విశేషం. మొత్తం మీద రాయ్‌లక్ష్మీ ఈతదుస్తుల దృశ్యం యువతకు పెద్ద పనే పెట్టిందన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి