ఏడేళ్లు.. 49 ట్రాన్స్‌ఫర్లు!

8 Feb, 2018 00:59 IST|Sakshi
ఇలియానా, అజయ్‌ దేవగన్

రైడ్‌కు వెళ్లారు హీరో అజయ్‌ దేవగన్‌. నెచ్చలితో సరదాగా సాగే రైడ్‌ కాదిది. పోనీ సోలోగా ఎంజాయ్‌ చేయడానికి చేసే రైడ్‌ కాదు. ఈ ప్రయాణానికి ఓ పర్పస్‌ ఉంది. నీతి, న్యాయం, ధర్మం లేకుండా దొడ్డిదారిన మూడు బ్రీఫ్‌కేస్‌లు, ఆరు స్కామ్‌లు చేసి డబ్బు దాచుకున్న వారిని రొడ్డున పడేసే రైడ్‌ ఇది. కాంప్రమైజ్‌ అవ్వడానికి, కామ్‌గా వెళ్లడానికి రైడ్‌ చేసేవాడు మాములోడు కాదు. ఏడేళ్లలో 49 సార్లు బదిలీ అయిన సిన్సియర్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌. పేరు అమీ పట్నాయక్‌. ‘రైడ్‌’లో అజయ్‌ దేవగన్‌ చేస్తున్న పాత్ర పేరిది.

అజయ్‌ దేవగన్, ఇలియానా, సౌరభ్‌ శుక్లా ముఖ్య తారలుగా రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తోపాటుగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ‘హీరోలు ఎప్పుడూ యూనిఫార్మ్స్‌లో రారు’ అనే ట్యాగ్‌ ఇచ్చి, ట్రైలర్‌ను షేర్‌ చేశారు అజయ్‌. ఈ సినిమాను మార్చి 16న విడుదల చేయాలనుకుంటున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో లక్నోలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా సినిమాను రూపొందించారని బాలీవుడ్‌ టాక్‌. ‘‘అజయ్‌ దేవగన్‌ వర్క్‌ పట్ల చాలా డేడికేషన్‌గా ఉంటాడు. అంత ఈజీగా ఇంప్రెస్‌ అవ్వడు. స్ట్రాంగ్‌ స్క్రిప్ట్‌ను అజయ్‌కు వినిపించాను. అప్పుడు ఒప్పుకున్నాడు. అజయ్‌తో వర్క్‌ చేయాలంటే ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌ పెట్టాల్సిందే’’ అన్నారు రాజ్‌కుమార్‌ గుప్తా.

మరిన్ని వార్తలు