వెండితెర నటుడిగానూ ఆదరించండి

27 Dec, 2019 00:21 IST|Sakshi
రాజశేఖర్‌ రెడ్డి, ‘సుడిగాలి’ సుధీర్, శేఖర్‌ రాజు

– ‘సుడిగాలి’ సుధీర్‌

‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టీవీ షోస్‌ ద్వారా పాపులర్‌ అయిన ‘సుడి గాలి’ సుధీర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ చిత్రంలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె. శేఖర్‌రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. నిర్మాత రాజ్‌ కందుకూరి, యాంకర్‌ సుమ అతిథులుగా ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక జరిగింది. ‘‘సుధీర్‌ బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌ బాగుంటుంది. ఈ ట్రైలర్‌ నాకు నచ్చింది. సినిమా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్‌ కందుకూరి. ‘‘ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుమ.

‘‘కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా ఇది. ఇప్పటి వరకు నన్ను బుల్లితెరపై ఎలా సపోర్ట్‌ చేశారో, అలాగే వెండితెరపై కూడా సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు సుధీర్‌. ‘‘ఈ సినిమాలో కథ కన్నా కొన్ని జీవితాలు కనిపిస్తాయి. కామెడీ టైమింగ్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సుధీర్‌ని హీరోగా ఎంపిక చేశాం. కథ నచ్చి ప్రజాగాయకుడు గద్దర్‌ ఇందులో ఓ పాట పాడి నటించారు’’ అన్నారు రాజశేఖర్‌. ‘‘మా బ్యానర్‌ ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శేఖర్‌. లిరిసిస్ట్‌ సురేష్‌ గంగుల, మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్, సినిమాటోగ్రాఫర్‌ రాంప్రసాద్,  ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా