మా వియ్యపురాలు ఇకలేరు: అమితాబ్‌

14 Jan, 2020 13:25 IST|Sakshi

బాలీవుడ్‌ అలనాటి హీరో రాజ్‌ కపూర్‌ కుమార్తె, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వియ్యపురాలు రీతూ నంద(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రీతూ.. ఢిల్లీలో మంగళవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బిగ్‌ బీ... ‘ మా వియ్యపురాలు, శ్వేత అత్తమ్మ రీతూ నంద హఠాన్మరణం చెందారు. ఉదయం 1.15 నిమిషాలకు కన్నుమూశారు. ప్రస్తుతం నేను ప్రయాణంలో ఉన్నాను’ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కాగా రాజ్‌ కపూర్‌ పెద్ద కుమార్తె రీతూ వివాహం వ్యాపారవేత్త రాజన్‌ నందాతో జరిగిన విషయం తెలిసిందే. వీరి కుమారుడు నిఖిల్‌ నందా.. అమితాబ్‌ బచ్చన్‌ తనయ శ్వేతాను పెళ్లిచేసుకున్నారు. 

ఇక కపూర్‌ కుటుంబంలో పెద్దక్క(రిషీ, రణ్‌ధీర్‌, రాజీవ్‌, రీమా కపూర్ల సోదరి)గా పేరొందిన రీతూ మరణంపై ఆమె మరదలు, రిషీ కపూర్‌ భార్య నీతూ కపూర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నా ప్రియమైన రీతూ... నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్‌ చేశారు. రీతూ మేనకోడలు, రిషీ కుమార్తె రిధిమా సైతం..‘ మీ అంత దయకలిగిన వ్యక్తిని నా జీవితకాలంలో ఎన్నడూ చూడలేదు. మీకు ఎవరూ సాటిరారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అత్తా’ అని సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. కాగా రీతూ నంద భర్త రాజన్‌ నందా 2018లో మరణించిన విషయం విదితమే.

To the kindest most gentle person I‘ve ever met - They don’t make them like you anymore - RIP bua #missyoualways❤️🙏🏻

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా