రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

22 Aug, 2019 19:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: హీరో రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నటుడు, రాజ్‌తరుణ్‌ మేనేజర్‌ రాజా రవీంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు రాజ్‌తరుణ్‌పై కార్తీక్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వాట్సాప్‌ ద్వారా కార్తీక్‌ కొన్ని వీడియోలు పంపాడని, తనతో సంప్రదింపులు జరపాలని డిమాండ్‌ చేసినట్లు రాజా రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక్‌ మొదట రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడని, ఆ తర్వాత రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అన్నారు. కార్తీక్‌ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నట్లు రాజా రవీంద్ర తెలిపారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని ఆయన ... రాజ్తరుణ్ వీడియోలతో కార్తీక్‌ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ గురువారం సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చదవండి: రాజ్‌తరుణ్‌ కారు కేసులో కొత్త ట్విస్ట్‌

కాగా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి  రాజ్‌ తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే కార్తీక్‌ అనే యువకుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.  ప్రమాదం జరిగిన వెంటనే రాజ్‌ తరుణ్‌ కారు దిగి పరుగులు పెడుతున్నట్లు... అతడిని పట్టుకోగా...తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన దృశ్యాలు బయటకు వచ్చాయి.

అయితే ఆ వీడియోలు ఇవ్వమని  రాజా రవీంద్ర తనను ఫోన్‌లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్‌ మీడియా ముందుకు వచ్చాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్‌తరుణ్‌ను పోలీసులు విచారణ చేయలేదు. అంతేకాకుండా కేసు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే తాను సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం వల్లే కారు ప్రమాదం నుంచి బయటపడినట్లు రాజ్‌ తరుణ్‌ మీడియాకు ఓ మెసేజ్‌ పెట్టిన విషయం విదితమే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

అక్కీ సో లక్కీ..

‘ఫైటర్‌’గా రౌడీ!

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

‘చిరంజీవి సినిమా అయితే ఏంటి?’

చిరుకు చిరుత విషెస్‌

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’

‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం

చందమామతో బన్నీ చిందులు

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ

తాగుడు తెచ్చిన తంటా!

మా నమ్మకం నిజమైంది

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

డిజాస్టర్ డైరెక్టర్‌తో నమ్రత ప్రాజెక్ట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

అక్కీ సో లక్కీ..

చిరుకు చిరుత విషెస్‌