నాని సినిమాలో రాజ్ తరుణ్

13 Aug, 2016 14:14 IST|Sakshi
నాని సినిమాలో రాజ్ తరుణ్

వరుస హిట్స్తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజ్ను సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది.

దర్శకుడు విరించి వర్మ తొలి సినిమాలో హీరోగా నటించిన యువ నటుడు రాజ్ తరుణ్, నాని హీరోగా తెరకెక్కుతున్న మజ్ను సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే మంచు విష్ణుతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటించిన రాజ్ తరుణ్ ఇప్పుడు నానితో కలిసి నటించడానికి ఓకె చెప్పాడు. క్లైమాక్స్లో వచ్చే రాజ్ తరుణ్ పాత్ర సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి