ఇక షురూ

4 Mar, 2019 03:55 IST|Sakshi
రాజ్‌ తరుణ్‌

‘లవర్‌’ తర్వాత చిన్న గ్యాప్‌ తీసుకున్న రాజ్‌ తరుణ్‌ లేటెస్ట్‌గా మరో కొత్త సినిమా అంగీకరించారు. ‘దిల్‌’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఆడు మగాడ్ర బుజ్జి’ని తెరకెక్కించిన ఆర్కే ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల హిట్స్‌ కోసం ప్రయత్నిస్తున్న రాజ్‌తరుణ్‌ ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ సాధించాలనే ప్లాన్‌లో ఉన్నారని అనుకోవచ్చు. ఈ నెల మూడో వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు