నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం

16 Mar, 2020 04:02 IST|Sakshi
రాహుల్‌ సిప్లిగంజ్, అనూప్, రాధామోహన్, సునీల్‌ రావు, రాజ్‌ తరుణ్, విజయ్‌కుమార్‌

– కొండా విజయ్‌కుమార్‌

రాజ్‌ తరుణ్, మాళవికా నాయర్‌ జంటగా విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ కరీంనగర్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుకలో సునీల్‌రావు (కరీంనగర్‌ మేయర్‌) ముఖ్య అతిథిగా  హాజరై ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఆడియో బిగ్‌ సీడీని విడుదల చేశారు. నిర్మాత కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా ఇది నా ఎనిమిదో సినిమా. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌. టీమ్‌ అందరి సహకారం వల్ల సినిమా బాగా వచ్చింది. ముందుగా ఉగాది కానుకగా ఈ సినిమాను మార్చి 25న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 21వరకు థియేటర్స్‌ మూసివేస్తున్నారు. తిరిగి సినిమా థియేటర్స్‌ ఓపెన్‌ చేయగానే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

‘‘ఇది క్లీన్‌ ఎంటర్‌టైనర్‌. రెండున్నర గంటలు ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం. రాజ్‌తరుణ్‌ ఫైట్స్, డ్యాన్స్‌లు ఇరగదీశాడు. రాధామోహన్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు విజయ్‌కుమార్‌ కొండా. ‘‘థియేటర్‌కు వచ్చి ఫ్యామిలీ అంతా రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ తర్వాత డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌గారితో ఇది నా హ్యాట్రిక్‌ ఫిల్మ్‌. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీ నాకు బాగా నచ్చుతుంది. రాజ్‌ తరుణ్‌తో నాకిది రెండో సినిమా’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. నటుడు మధుసూధన్, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ రమే‹ష్, కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు