రెండున్నర గంటలు నవ్వులే

13 Mar, 2020 06:07 IST|Sakshi
రాధామోహన్, రాజ్‌ తరుణ్, మాళవికా నాయర్, కొండా విజయ్‌కుమార్‌

– రాజ్‌ తరుణ్‌

‘‘ఒరేయ్‌ బుజ్జిగా’ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌. థియేటర్‌లో రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. కుటుంబ సభ్యులంతా వచ్చి సంతోషంగా నవ్వుకుని వెళ్లే సినిమా’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్, మాళవికా నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కొండా విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులందరూ నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చేశా.

ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లే మా సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు. రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘యువతకి, కుటుంబ సభ్యులకి నచ్చే అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. ఈ నెల 14న కరీంనగర్‌లో, 19న తిరుపతిలో, 21న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుకలు చేస్తాం’’ అన్నారు. మాళవికా నాయర్, నటుడు మధునందన్, సినిమాటోగ్రాఫర్‌ ఐ ఆండ్రూ, కో– డైరెక్టర్‌ వేణు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.
 

మరిన్ని వార్తలు