నెట్టింట కాదు థియేటర్‌లోనే విడుదల

11 Apr, 2020 12:25 IST|Sakshi

మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం సినీ రంగంపై భారీగానే పడింది. వైరస్‌ వ్యాప్తి నివారణ నియంత్రణలో భాగంగా ప్రపంచంతో పాటు భారత్‌ లాక్‌డౌన్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా అనేక సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే పలు హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు నెట్టింట్లో విడుదల చేశారు. డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం వేదికగా రిలీజ్‌ అవుతున్న కొత్త సినిమాలకు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ వస్తోంది. దీంతో పలు చిన్న సినిమాలు కూడా డిజిటల్‌ బాట పడుతున్నాయి. అయితే యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’చిత్రం కూడా నెట్టింట విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

అయితే ‘ఒరేయ్‌ బుజ్జిగా’చిత్ర విడుదలపై నిర్మాత రాధామోహన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఒరేయ్‌ బుజ్జిగా చిత్ర విడుదల విషయంలో వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం. మా చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుంది’అంటూ నిర్మాత ట్వీట్‌ చేశారు. ఉగాది కారణంగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇక రాజ్‌ తరుణ్‌ సరసన మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌లకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనుప్‌ రుబెన్స్‌ సంగీతమందించాడు.  


చదవండి:
హీరోయిన్‌ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు?
కరోనాపై పోరులో చిరంజీవి తల్లి

మరిన్ని వార్తలు