‘నీ లవ్‌ స్టోరీ సింప్లీ సూపర్‌’

4 Mar, 2020 19:09 IST|Sakshi

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటూనే మరోవైపు ప్రమోషన్లను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ప్రి టీజర్‌, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటీవ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా చిత్ర టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందించిన ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్‌ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్‌ చేయడానికి రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’, ‘అసలు బాయ్‌ ఫ్రెండ్‌ అంటే ఏమిటి? ఒక ఫ్లిప్‌కార్ట్‌, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్‌మైషో, ఒక క్రెడిట్‌ కార్డ్‌’ అంటూ టీజర్‌లో వచ్చే డైలాగ్‌లు యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉన్నాయి. ‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’, ‘నీకు తెలిసిన స్టోరీలో తెలియన్‌ ట్విస్టు ఉంది’ అంటూ చివర్లో వచ్చే డైలాగ్‌లు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో యూత్‌ను టార్గెట్‌ చేస్తూ విడుదల చేసిన టీజర్‌ సినిమాకు మరింత ప్లస్‌గా నిలిచే అవకాశం ఉంది. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించాడు.  


చదవండి:
‘అమృతరామమ్‌’ ఎప్పుడంటే?
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’

మరిన్ని వార్తలు