దాసరి బాటలో రాజమౌళి

2 Sep, 2015 10:00 IST|Sakshi
దాసరి బాటలో రాజమౌళి

తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా దర్శక రత్న దాసరి నారాయణకి చాలా పేరుంది. అందుకే గతంలో సినీ రంగానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అందులో దాసరి తప్పకుండా కనిపించేవారు. సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచి సక్సెస్ మీట్ల వరకు ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ ఆయన దర్శనమిచ్చేవాడు. అంతేకాదు తనవంతుగా చిత్రయూనిట్కు సలహాలు, సూచనలు ఇస్తూ దాసరి అంటే అందరివాడన్న ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా మారిన జక్కన్న, ప్రస్తుతం ప్రతి సినిమా ఫంక్షన్ లోనూ కనిపిస్తున్నాడు. కేవలం ఫంక్షన్లకు హాజరవ్వటమే కాదు. కొత్త సినిమాల ఫస్ట్ లుక్ రిలీజ్ల నుంచి, ట్రైలర్ లాంచ్ ల వరకు ప్రతి విషయం పై స్పందిస్తూ అందరికీ పెద్దదిక్కుగా మారుతున్నాడు.  ఆయా సినిమాలకు సంబంధించి పలు విషయాలను తన ట్విట్టర్లో షేర్ చేస్తున్నాడు. వాళ్ల నటనను, పనితనాన్ని మెచ్చుకోవటం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా