ఆర్‌ఆర్‌ఆర్ : మ్యాజిక్‌ డేట్‌.. మరో అప్‌డేట్‌!

30 Nov, 2018 11:58 IST|Sakshi

టాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రస్తుతం నేషనల్‌ లెవల్లో చర్చనీయాంశంగా మారింది. బాహుబలి సిరీస్‌లతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు రాజమౌళి. ఇక అప్పటినుంచి జక్కన్న తదుపరి ప్రాజెక్ట్‌పై జాతీయ స్థాయి మీడియా కన్నేసింది. అయితే అనూహ్యంగా రాజమౌళి ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌లతో భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించడంతో టాలీవుడ్‌లో వేడి పుట్టిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌ అనేది ఏ రేంజ్‌లో వైరల్‌ అయిందో తెలిసిందే. 

రీసెంట్‌గా నవంబర్‌ 11 ఉదయం 11 గంటలకు (11-11-11) పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన రోజున చిత్రాన్ని ప్రారంభించిన జక్కన్న.. మరో స్పెషల్‌ డేపై కన్నేశారని సమాచారం. 12-12-12న ఈ ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ విషయమేంటని చర్చ నడుస్తోంది. అది హీరోయిన్ల విషయమే కావచ్చు లేదా ప్రతినాయకుడి పాత్రకు సంబంధించినదే కావచ్చు లేదా.. సినిమా టైటిల్‌ కావచ్చు.. మరి జక్కన్న మదిలో ఏముందో.. ఆ స్పెషల్‌ తేదీన ఏ విషయాన్ని ప్రకటిస్తారో వేచి చూడాలి. ఇప్పటికైతే రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించాడు. 

మరిన్ని వార్తలు