‘అందుకే ప్రభాస్‌ పెళ్లి చేసుకోవడం లేదు’

24 Dec, 2018 10:50 IST|Sakshi

కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 6లో పాల్గొన్న బాహుబలి త్రయం(ప్రభాస్‌, రానా, రాజమౌళిలు) పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి టెలికాస్ట్‌ అయిన కాఫీ విత్‌ కరణ్‌ ఎపిసోడ్‌ చాలా సరదాగా సాగింది. ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో కరణ్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను బాహుబలి టీమ్‌ ముందు ఉంచారు.

ప్రభాస్‌, రానాల పెళ్లిపై..
ప్రభాస్‌, రానాల పెళ్లి ఎప్పుడని కరణ్‌ రాజమౌళిని ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ప్రభాస్‌ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే.. అతడు చాలా లేజి, పెళ్లి చూపులు, వెడ్డింగ్‌ కార్డులు పంచడం, పెళ్లి వేడుక ఇదంతా చాలా టైమ్‌ తీసుకుంటుందని.. అదంతా ప్రభాస్‌ చేయలేడని సరదాగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ కాకుండా ఓ అమ్మాయితో మూవ్‌ అన్‌ కావచ్చుగా అని కరణ్‌ అడగ్గా.. ప్రభాస్‌ అలా చేయడని.. మ్యారేజీ చేసుకోవడానికి మాత్రం లేజిగా ఫీల్‌ అవుతాడని తెలిపారు. రానా ఓ స్ట్రక్చర్‌ ప్రకారం ముందుకు వెళ్తున్నాడని.. ఏ వయస్సులో ఏది చేయాలో అది చేస్తాడని తెలిపారు. అందులో పెళ్లి అనే అంశం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభాస్‌ చాలా ఫూడీ అని రాజమౌళి తెలిపారు. హైదరాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేయడానికి ప్రభాస్‌ ఇష్టపడతారని తెలిపారు. 

Who do you think will get married first? #KoffeeWithKaran #KoffeeWithTeamBaahubali

A post shared by Star World (@starworldindia) on

 
ఫిల్మ్‌ స్కూల్‌కు వెళ్లినట్టయింది..
ఇంతటి గొప్ప చిత్రానికి పనిచేయడం ఎలా అనిపించిందని కరణ్‌ ప్రశ్నించగా నాలుగేళ్లు ఫిల్మ్‌ స్కూల్‌కు వెళ్లినట్టుందని రానా సరదా సమాధానమిచ్చారు. బాహుబలి షూటింగ్‌లోనే తమ మూడు, నాలుగు బర్త్‌ డేలు కూడా జరిగాయని తెలిపారు. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి ప్రభాస్‌ ఈ షోలో వెల్లడించారు. ‘ఈ సినిమా రిలీజ్‌ రోజు నా స్నేహితులకు ఓ విషయం చెప్పాను. సినిమా బ్లాక్‌బాస్టర్‌ రెస్పాన్స్‌ వస్తేనే నాకు ఫోన్‌ చేసి నిద్ర లేపమని, లేకుంటే వద్దని చెప్పాన’ని పేర్కొన్నారు.  

బాహుబలి హిందీలో తీసి ఉంటే..
అలాగే ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో బాహుబలి హిందీలో తీసి ఉంటే ఎవరిని నటీనటులుగా ఎంచుకునే వారని కరణ్‌ రాజమౌళిని ప్రశ్నించారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. అనుష్క పోషించిన దేవసేన పాత్రకు దీపికా పదుకోనె సరిపోయేదని తెలిపారు. అలాగే రానా, ప్రభాస్‌ క్యారెక్టర్‌ల విషయంలో మాత్రం ఆయన ఎవరి పేరు చెప్పలేదు. ఆ పాత్రల్లో వారిని తప్ప ఎవరిని ఊహించుకోలేనని స్పష్టం చేశారు. 

అనుష్కతో డేటింగ్‌పై..
‘హీరో హీరోయిన్లు వరుసగా కలిసి పనిచేస్తే.. వారిద్దరికి లింక్‌ పెట్టేసి ప్రచారం చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే అనుష్కతో డేటింగ్‌ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే.. కావాలంటే రాజమౌళిని (సరదాగా) అడగండ’ని ప్రభాస్‌ తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

సూపర్‌ హిట్ రీమేక్‌పై క్లారిటీ

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

‘అర్జున్‌ సురవరం’ వాయిదా పడనుందా!

సినిమా చూపిస్త మావా..

శాండల్‌వుడ్ సీనియర్‌ నటి కన్నుమూత

ముచ్చటగా మూడోసారి..

భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘కాదండి.. బాధ ఉండదండి..’

చేయి కడుక్కుని వస్తానని అక్కడి నుండి జంప్‌..

స్క్రీన్‌ టెస్ట్‌

ఆకాశవాణి

చలనమే చిత్రము

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది

మేలో మొదలు

ఆఫీసర్‌ కంగన

సమ్మర్‌లో షురూ

ఫారిన్‌ కోచ్‌

రాజకీయ నేపథ్యంలో...

యంగ్‌ అండ్‌ ఓల్డ్‌

బిజీ నితీన్‌

కొత్త దారి!

ఎలాంటి పాత్రలైనా ఓకే

ప్రచారం లేదు.. పోటీ లేదు!

సినీ హోలీ

చిన్న చిత్రాన్ని ఆదరిస్తున్నారు

‘వెళ్లి స్నానం చేసి వస్తాను...పెళ్లి చేసుకుందాం’

రమేష్‌ వర్మ దర్శకత్వంలో నితిన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..