అదిరింది తలైవా

5 Oct, 2018 05:43 IST|Sakshi
రజనీకాంత్‌

రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ అండ్‌ టైటిల్‌ను సెప్టెంబర్లో రిలీజ్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా రజనీకాంత్‌ సెకండ్‌ లుక్‌ను గురువారం రిలీజ్‌ చేసి రజనీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు టీమ్‌. ఫస్ట్‌ లుక్‌లో రజనీకాంత్‌ ఫుల్‌ మాస్‌గా కనిపిస్తే, సెకండ్‌ లుక్‌లో క్లాస్‌గా కనిపించారు.

ఈ లుక్స్‌ని బట్టి సినిమాలోని రజనీకాంత్‌ క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉంటాయని అర్థం అవుతుంది. అలాగే సెకండ్‌ లుక్‌ 1980 కాలంనాటిదిగా ఉంది. అంటే ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ వారణాసిలో జరుగుతోందని సమాచారం. రజనీ, విజయ్‌సేతుపతి, త్రిషలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, డైరెక్టర్‌ శశి, మేఘా ఆకాశ్, సనత్‌ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు