రిస్కీ స్టంట్స్‌ చేస్తున్న సీనియర్‌ హీరో

15 Nov, 2018 16:57 IST|Sakshi

చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్‌ హీరో రాజశేఖర్‌. ఈ సక్సెస్‌ తరువాత షార్ట్ గ్యాప్‌ తీసుకున్న రాజశేఖర్‌ మరో ప్రయోగం చేస్తున్నారు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో రాజశేఖర్‌ డూప్‌ లేకుండా రిస్కీ స్టంట్స్‌ చేస్తున్నారట. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదా శర్మ, నందిత శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు