రాజమౌళి ఆ ‘ఆర్‌’ పై క్లారిటీ

31 Mar, 2018 15:16 IST|Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే టీజర్‌ తో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌లో తానో మల్టీ స్టారర్‌ చేయబోతున్నట్టుగా ప్రకటించారు రాజమౌళి. అధికారిక ప్రకటనకు ముందు నుంచే ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి. సినిమా నటీనటుల నుంచి పాత్రల వరకు చాలా రూమర్స్‌ టాలీవుడ్‌ లో చక్కర్లు కొట్టాయి. అదే బాటలో ఈ సినిమాలో విలన్‌గా యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించనున్నాట్టుగా వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తమ కూతురు శివానీ హీరోయిన్‌ గా తెరకెక్కుతున్న 2 స్టేట్స్‌ సినిమా ప్రారంభోత్స కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాత్రమే రాజమౌళిని కలిసాం. మల్టీ స్టారర్‌కు సంబంధించి రాజమౌళి గారు తమను సంప్రదించలేదన్నారు’  దీంతో రాజమౌళి మల్టీ స్టారర్‌లో రాజశేఖర్‌ విలన్‌ అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. అంతేకాదు సినిమాలో నటీనటుల ఎంపికకు రాజమౌళి ఆర్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారన్న వార్తలు నిజంగా కాదని తేలిపోయింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు