రాజశేఖర్‌ నటవిశ్వరూపం ‘అర్జున’

14 Feb, 2020 15:02 IST|Sakshi

యాంగ్రీ హీరో రాజశేఖర్‌, మరియం జకారియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున’. రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి క్రాంతి, నట్టి కరుణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 15న విడుదల చేస్తారో లేక ‘అర్జున’ను ఆలస్యంగా విడుదల చేస్తారో వేచి చూడాలి. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. 

ఇక ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్‌ తన పాత్రలలో నట విశ్వరూపం చూపించారని, ప్రస్తుత రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమని నిర్మాతలు పేర్కొన్నారు. వయసు మళ్లిన సూర్యనారయణ అనే రైతు పాత్ర, ఆయన తనయుడిగా అర్జున్‌ పాత్రలో రాజశేఖర్‌ ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. అంతేకాకుండా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయన్నారు. యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దర్శకుడు కన్మణి ఈ చిత్రాన్ని మలిచారని నిర్మాతలు పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్‌, కాదంబరి కిరణ్‌, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతమందిస్తున్నాడు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు