48 ఏళ్లు వెనక్కి!

25 Jul, 2018 00:22 IST|Sakshi

రాజశేఖర్‌ టైమ్‌ మెషీన్‌ని వెనక్కి తిప్పనున్నారు. అది కూడా ఏ పదేళ్లో.. పాతికేళ్లో కాదు.. ఏకంగా 48ఏళ్లు.. ఎందుకిలా వెనక్కి వెళుతున్నారంటే ఆయన నటించనున్న తాజా చిత్రం కోసమట. ‘గరుడవేగ’తో మంచి హిట్‌ అందుకున్న రాజశేఖర్‌ తన తర్వాతి చిత్రంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆ మధ్య ఓ హింట్‌ ఇచ్చారు. ‘‘నా తర్వాతి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను.

అది అద్భుతంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్‌ ఏంటంటే.. ‘అ’ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఆగస్టులో ఈ మూవీ స్టార్ట్‌ కానుంది.
 

మరిన్ని వార్తలు