వారిద్దరు విడిపోయారా?!

9 Jul, 2020 15:47 IST|Sakshi

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్‌ సేన్ వైవాహిక బంధంలో కలతలు రేగినట్లు బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. రాజీవ్‌, అతని భార్య చారు అసోపాల మధ్య దూరం పెరిగిందని, వారు విడిగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి దంపతులిద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో కావడం సహా పెళ్లి ఫొటోలు డెలిట్‌ చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కాగా గతేడాది జూన్‌లో మోడల్‌ రాజీవ్‌ సేన్‌, టీవీ నటి చారు అసోపా వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. (అవును.. మేం విడిపోయాం: నటి)

ఈ క్రమంలో పెళ్లి జరిగిన ఆరు నెలల తర్వాత వీరి బంధం బీటలు వారినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇటీవల స్పందించిన రాజీవ్‌.. ‘‘ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు’’అంటూ విడాకుల విషయాన్ని ఖండించాడు. అంతేగాక తన భార్యతో కలిసి దిగిన ఇన్‌స్టాలో షేర్‌ చేసి వదంతులకు చెక్‌ పెట్టాడు. అయితే తాజాగా రాజీవ్‌ సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి పెళ్లి ఫొటోలు డెలిట్‌ చేయడం, చారు సైతం తన పేరు నుంచి రాజీవ్‌ ఇంటిపేరును తొలగించుకోవడంతో ఈ స్టార్‌ జంట మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో రాజీవ్‌, చారుతో గొడవపడి ఢిల్లీకి వెళ్లిపోయాడని, తన అకౌంట్ల నుంచి ఆమెను బ్లాక్‌ చేశాడని గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా