రజనీ 2.o నిడివి ఎంతో తెలుసా?

11 Jan, 2018 18:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్‌. ఆయన తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 2.o... 'రోబో'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ  సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2.o సినిమా మొత్తం నిడివి వంద నిమిషాలు మాత్రమేనట. అంటే గంట 40 నిమిషాలు మాత్రమే. ఒకప్పుడు సినిమా నిడివి మూడు గంటలు ఉంటే.. ఇప్పుడు రెండున్నర గంటలకు తగ్గిన సంగతి తెలిసిందే. మామూలుగా కమర్షియల్‌ సినిమాలు రెండు గంటలకుపైగా ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా గంట 40 నిమిషాల్లో ఈ అత్యంత భారీ సినిమాను శంకర్‌ ముగించినట్టు చెప్తున్నారు. ఏమాత్రం సాగదీసే సీన్స్‌ లేకుండా.. చూస్తున్నంతసేపు ఉత్కంఠగా ఉండేలా సినిమాను కుదించబోతున్నారని చెప్తున్నారు. ఇది సినిమాకు ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, అరబిక్‌ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌14న విడుదల చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ  సినిమాలో అక్షయ్‌కుమార్‌, అమీజాక్సన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!