రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం

19 Dec, 2019 17:16 IST|Sakshi

తమిళ తలైవా రజనీకాంత్‌.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారే తప్పితే అది కార్యరూపం దాల్చడంలో అలసత్వం వహిస్తున్నారని కొంతమంది అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై నోరు విప్పని రజనీ సినిమాల్లో మాత్రం స్పీడు పెంచాడు. రాజకీయాల కోసం రజనీ సినిమాలు వదిలేయలేదని మరికొంతమంది అభిమానులు ఆనందరపడుతున్నారు. ఈ క్రమంలో రజనీ తాజాగా నటించిన ‘దర్బార్‌’ విడుదలకు సిద్ధంగా ఉండగా మరో సినిమా పట్టాలెక్కించాడు. ఇది రజనీకాంత్‌కు 168వ సినిమా కాగా, దీనికి సంబంధించిన షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యాక్షన్‌ డైరెక్టర్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

రజనీకాంత్‌తో సంగీత దర్శకుడు డి ఇమ్మాన్‌
తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. పాటతో సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని సంగీత దర్శకుడు డి ఇమ్మాన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రజనీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘నిరాడంబరంగా కనిపించే రజనీ సర్‌, తన మాటలతో చుట్టూరా ఉండేవారిలో చైతన్యం తీసుకువస్తాడు. అతని శక్తి చూస్తే ఔరా అనిపించక మానదు’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. సన్‌పిక్చర్స్‌ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ప్రస్తుతం రజనీకాంత్‌ దర్బార్‌ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 9న బాక్సాఫీస్‌ బరిలో దిగనుంది. (చదవండి: అమితాబ్‌ రాజకీయాల్లోకి వెళ్లొద్దన్నారు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా