సైరాలో సూపర్‌స్టార్‌?

21 Aug, 2019 08:36 IST|Sakshi

చెన్నై: మెగాస్టార్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌ ఉండబోతున్నారు. ఏమిటీ నమ్మసక్యం కావడం లేదా! చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటి నయనతార నాయకిగా నటించింది. ఇక బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్‌ సంచలన నటుడు విజయ్‌సేతుపతి, కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్, జగపతిబాబు, నటి తమన్నా, అనుష్క వంటి ప్రముఖ నటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి కొడుకు, యువ నటుడు రామ్‌చరణ్‌ నిర్మింస్తున్న ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఐదు భాషల్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

కాగా షూటింగ్‌ పూర్తయి నిర్మాణ కార్యక్రమాలు ముగియడంతో ఇందులో నటుడు రజనీకాంత్‌కు పనేముంది అనే సందేహం కలగవచ్చు. కాగా సైరాకు బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ వాయిస్‌ను తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇచ్చారు. ఇక తమిళంలో సూపర్‌స్టార్‌ ఇస్తే బాగుంటుందని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. రజనీకాంత్, చిరంజీవిల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సైరా చిత్రానికి నేపధ్య వాయిస్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

అదే విధంగా మలయాళంలో మోహన్‌లాల్, కన్నడం యష్, హిందీలో హృతిక్‌రోషన్‌లతో బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ను ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా రజనీకాంత్‌ ప్రస్తుతం దర్బార్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాగా ఇటీవలే రజనీకాంత్, నయనతారలతో కలసి చిత్ర యూనిట్‌ జైపూర్‌కు వెళ్లారు. మరి సైరాకు రజనీకాంత్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ ఎప్పుడు ఇస్తారో? అన్న ఆసక్తి నెలకొంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

కిర్రాక్‌ లుక్‌

మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

ప్రముఖ దర్శకుడు మృతి

రాహుల్‌ ప్రేమలో పడ్డాడా!

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

‘సాహో నుంచి తీసేశారనుకున్నా’

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’

హర్రర్‌ సినిమాతో మాలీవుడ్‌కి!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

బాలయ్య కొత్త సినిమా లుక్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

మెగాస్టార్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు