ఇక షురూ!

25 Nov, 2019 04:03 IST|Sakshi
రజనీకాంత్‌

‘ఇక సెట్స్‌కు వెళ్లడమే మిగిలింది. అంతా రెడీ చేసుకున్నారు’.. ఇదీ రజనీకాంత్‌ కొత్త సినిమా గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో స¯Œ  పిక్చర్స్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల 5న మొదలవుతుందట. కథానాయికగా జ్యోతిక, కీర్తీ సురేష్‌ల పేర్లు వినిపించాయి. టైటిల్‌ ‘వ్యూహం’  అని టాక్‌.  ఈ సినిమాకు డి. ఇమ్మాన్‌ సంగీతం అందించనున్నారు.

‘దర్బార్‌’ పాట
రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. పోలీసాఫీసర్‌ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్‌. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆయన పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ‘చుమ్మక్కళై’ పాటను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు వివేక్‌ లిరిక్స్‌ అందించారు. ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరకర్త. ‘దర్బార్‌’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుందని తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

సినిమా

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌