నా దర్శక–నిర్మాతలకు అంకితం

21 Nov, 2019 00:45 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్‌

– రజనీకాంత్‌

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వేడుకలు బుధవారం గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్‌ను ‘స్పెషల్‌ ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ’తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అమితాబ్‌ చేతుల మీదుగా అందుకున్నారు రజనీ.

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నాను. నాకు ఈ స్థానం కల్పించిన నా అభిమానులకు, తమిళ ప్రజలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్‌ యాక్టర్‌ ఇజబెల్లా హప్పెట్‌కు లైఫ్‌టైమ్‌ అచీమ్‌మెంట్‌ అవార్డును అందించారు. నవంబర్‌ 28 వరకూ ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు