రజనీకాంత్‌ మరో కొత్త చిత్రం

23 Feb, 2018 16:23 IST|Sakshi

సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరో కొత్త చిత్రాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రెండు చిత్రాలు నటిస్తున్న రజనీ తన తర్వాతి చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో నటించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పిజ్జా, ఇరైవి వంటి వైవిద్య చిత్రాలను తెరెక్కించిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడిగా పని చేయనున్నారు. త్వరలోనే ఈచిత్రం పట్టాలెక్కనుందని నిర్మాత కళనిధి మారన్‌ తెలిపారు.

ఇప్పటికే రజనీకాంత్‌ కాలా, 2.ఓ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 14న కాలా విడుదల కానుంది. సుప్రసిద్ధ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం కూడా తుది దశకు వచ్చింది. కాలా తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు