శివ దర్శకత్వంలో తలైవా 168వ సినిమా

11 Oct, 2019 16:44 IST|Sakshi

జయాపజయాలతో సంబంధం లేకుండా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ‘పేట’ చిత్రంతో హిట్‌ కొట్టిన తలైవా ప్రస్తుతం దర్బార్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇదే జోష్‌లో మరో సినిమాకు రజనీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దర్బార్‌ తదుపరి తమ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కే సినిమాలో రజనీ నటించనున్నారని సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.‘ ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ల తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సన్‌ పిక్చర్స్‌ మెగా కాంబినేషన్‌లో తలైవార్‌ 168వ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తారు’ అంటూ రజనీ, సన్‌ పిక్చర్స్‌ అధినేత కళానిధి మారన్‌, శివ ఫొటోలతో కూడిన వీడియోను ట్విటర్‌ షేర్‌ చేసింది. 

కాగా ఈ కాంబినేషన్‌లో రూపొందిన రోబో, పేట చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడంతో.. ప్రస్తుతం రజనీ 168వ సినిమా కూడా రికార్డులు తిరగరాసి హ్యాట్రిక్‌ హిట్‌గా నిలుస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగులో దరువు, శంఖం, శౌర్యం వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శివ.. వేదాలం, వివేగం, విశ్వాసం వంటి చిత్రాలతో తమిళ స్టార్‌ హీరో అజిత్‌కు హిట్లు ఇచ్చి ఫుల్‌ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు