24 Oct, 2018 12:09 IST|Sakshi

2019 పొంగల్‌కి రసవత్తరంగా మారనుంది. భారీ మాస్‌ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్‌ అవుతుండటంతో బాక్సాఫీస్‌ మరింత వేడెక్కనుంది. రజనీకాంత్ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పేట్ట సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

రజనీ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న విశ్వాసం సినిమాను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. వివేగం సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న అజిత్‌ వీలైనంత త్వరగా విశ్వాసం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

రజనీ పేట్ట షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా విశ్వాసం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రెండు సినిమాలో ఓకేసారి రిలీజ్‌ రెడీ అవ్వటం కన్ఫమ్ అంటున్నారు ఫ్యాన్స్‌. మరి ఇద్దరు ఒకేసారి బరిలో దిగుతారా. లేక ఎవరైన వెనక్కి తగ్గుతారా తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వార్తలు