సెల్యూట్‌ ఆఫీసర్‌

25 Jul, 2019 00:50 IST|Sakshi
రజనీకాంత్‌

‘దర్బార్‌’లో రజనీకాంత్‌ రాజసం మామూలుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా.. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా రజనీ ఎలా ఉన్నారో! మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్‌’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్‌. ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముంబైలో ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుందని టాక్‌.

ఆగస్టు చివరికల్లా షూట్‌ కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు మురుగదాస్‌. తాజాగా ఈ సినిమాలోని రజనీ లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇదివరకు కూడా ఈ సినిమా స్టిల్స్‌ లీక్‌ అయినప్పటికీ ఖాకీడ్రెస్‌లో రజనీ ఉన్న లుక్‌ బయటకు రావడం ఇదే తొలిసారి. ఇందులో బాలీవుడ్‌ నటులు సునీల్‌ శెట్టి, ప్రతీక్‌ బబ్బర్‌ విలన్లుగా నటిస్తున్నారు. నివేదా థామస్, యోగిబాబు కీలకపాత్రలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు