బ్యాక్‌ టు హోమ్‌

6 May, 2018 00:21 IST|Sakshi
రజనీకాంత్‌, లత

రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌. అందరి కళ్లూ ఆయన మీదే ఉంటాయి. అందుకే ఆయన సతీమణి లత ‘ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి’ అంటూ దిష్టి తీసి, ఇంటి లోపలికి ఆహ్వానించారు. ఇటీవల జస్ట్‌ మెడికల్‌ చెకప్‌ కోసం యూఎస్‌ వెళ్లిన రజనీకాంత్‌ తిరిగి ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు దిష్టి తీశారు లత.

ఈ సంగతి ఇలా ఉంచి సినిమాలను టచ్‌ చేస్తే... ‘కబాలి’ ఫేమ్‌ రంజిత్‌. పా దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ధనుష్‌ నిర్మించిన ‘కాలా’ చిత్రం జూన్‌ 7న రిలీజ్‌ కానుంది. ఈ నెల 9న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకను వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  మరోవైపు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటించనున్న సినిమా త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది.

మరిన్ని వార్తలు