స్పీడు పెంచిన ‘చిట్టీ’

2 Oct, 2018 11:39 IST|Sakshi

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ విజువల్‌ వండర్‌ 2.ఓ. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నవంబర్‌ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్‌ వాయిదా పడటంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు చిత్రయూనిట్.

ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు చివరిదశకు చేరుకోవటంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇటీవల రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో తాజాగా నాలుగవ మేకింగ్‌ వీడియోను రిలీజ్ చేశారు. గ్రాఫిక్స్, షూటింగ్‌ కు సంబంధించి చిత్రయూనిట్ ఎంత శ్రమకు ఓర్చి సినిమాను తెరకెక్కించారో ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అమీజాక్సన్‌ రజనీకి జోడిగా కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు