నటనలో సాధించానని అనుకోవడం లేదు

19 Dec, 2019 10:13 IST|Sakshi

తమిళనాడు, పెరంబూరు: నటనలో నేను సాధించానని అనుకోవడం లేదు అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేర్కొన్నారు. దక్షిణాది సూపర్‌స్టార్‌గా కొనియాడబడుతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం దర్బార్‌. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. కాగా దర్బార్‌ హిందీలోనూ విడుదల కానుండడంతో ఇటీవల చిత్ర యూనిట్‌ ముంబైలోనూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్‌ ఇచ్చిన సమాధానాలను చూద్దాం.

ప్ర: నటనలో మీకింత సామర్థ్యం ఎక్కడ నుంచి వచ్చింది?
జ: నిజం చెప్పాలంటే డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది. తీసుకున్న పారితోషికానికి తగ్గట్టుగా నేను ఆ పాత్రలకు న్యాయం చేయాలి. ఇక నటించడం అన్నది నాకు చాలా ఆసక్తి. కెమెరా ముందుకు రావడం, వెలుగులో ఉండడం నాకు ఇష్టం. అదే నాకు సమర్థతను కలిగిస్తుంది.

ప్ర: నటుడిగా ఎంత వరకూ ఎదిగానని అనుకుంటున్నారు?
జ: వాస్తవంగా చెప్పాలంటే నేను నటుడిగా ఎదగలేదనే భావిస్తాను.ఆరంభంలో కొంచెం బిడియంగానూ, బెదురుగానూ ఉండేది. నటించగా నటించగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మరో విషయం ఏమిటంటే నేను దర్శకుల నటుడిని. నటన అనేది నాకిచ్చిన పాత్రల పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎలానో ప్రేక్షకులకు నేను నచ్చేశాను. అంతే కానీ నటనలో నేనే ఎదిగానని భావించడం లేదు.అప్పుడు ఇప్పుడు ఓకే రజనీకాంత్‌

ప్ర: గత 8 నుంచి 12 ఏళ్లలో అమితాబ్‌ నటించిన చిత్రాల్లో ఏ చిత్రానైనా రీమేక్‌ చేయాలనిపించిన చిత్రం ఉందా?
జ: షమితాబ్‌ చిత్రం

ప్ర: మీకు ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు ఉన్నారు. అయినా ఒకే ఒక్క హాలీవుడ్‌లో మాత్రమే నటించారే?
జ:  మంచి కథ, అవకాశాలు రాలేదు. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను.

ప్ర:ముంబైలో మీకు నచ్చింది?
జ:  ఒకటని కాదు ముంబై అంటేనే చాలా ఇష్టం,

ప్ర:మీ చిత్రంలో నటించిన సునిల్‌శెట్టి గురించి?
జ:  ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ముఖ్యంగా వరుసగా చిత్రాలు చేస్తున్న సునిల్‌శెట్టి ఆయన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోతే నటనను దూరంగా పెట్టి ఆయనకు వైద్యం చేయించడానికే సమయాన్ని కేటాయించారు. అలా నాలుగేళ్ల విరామం తరువాత ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు సునిల్‌శెట్టి.

మరిన్ని వార్తలు