బాలచందర్‌ కీర్తి సజీవంగానే ఉంటుంది

10 Jul, 2020 08:00 IST|Sakshi

సినిమా: తమ కీర్తి సజీవంగా ఉన్నంతవరకు దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌ కీర్తి ప్రతిష్ట లు సజీవంగానే ఉంటాయని నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు. గురువారం దర్శక శిఖరంగా పేరుగాంచిన దివంగత దర్శక దిగ్గజం కె.బాలచందర్‌ 90వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు పుష్పాకంద స్వామి, బి.కందస్వామి స్థానిక ఆళ్వార్‌ పేటలోని రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్‌ కార్యాలయంలో గల కె.బాలచందర్‌ శిలా విగ్రహానికి నివాళులర్పించారు. కాగా నటుడు రజినీకాంత్, ప్రకాష్‌ రాజ్‌ వంటి ఎందరో నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కె.బాలచందర్‌. అదేవిధంగా కమలహాసన్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన దర్శకుడు ఈయన. నీల్కుమిలి చిత్రంతో దశ దర్శకుడిగా తన సినీ పతనాన్ని ప్రారంభించిన కె.బాలచందర్‌ ఆ తర్వాత సర్వర్‌ సుందరం, ఇరు కొడుగాల్, అపూర్వసహోదర్గళ్‌ విభిన్న కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

తొమ్మిది సార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఈయన కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ ,దాదాసాహెబ్‌ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. అలాంటి కె బాలచందర్‌ అనారోగ్యం కారణంగా 2014 డిసెంబర్‌ 23న కన్నుమూశారు. కాగా గురువారం ఆయన 90వ జయంతి సందర్భంగా కమలహాసన్‌ ,రజనీకాంత్‌ ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ముందుగా కమలహాసన్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ  కె.బాలచందర్‌ ను తనను  తొలిసారిగా వాహినీ స్టూడియో జరుగుతున్న వెళ్లి విళా చిత్ర షూటింగ్‌ లో జెమినీ గణేశన్‌ పరిచయం చేశారు అని చెప్పారు. అప్పుడు చాలా బిజీగా ఉన్న కె.బాలచందర్‌ ఒక క్షణం తనను చూశారని అన్నారు. ఆ క్షణంలో ఆయన నాపై చూసిన ఆ చూపే తమ మధ్య పెద్ద బంధానికి దారితీస్తుందని ఊహించలేదన్నారు. ఆ తర్వాత పదహారేళ్ల వయసులో తాను బాలచందర్‌ వద్దు అని చెప్పానని అలా ఆయన జీవితంలో తనకు ఇచ్చిన స్థానం, తాను తన జీవితంలో ఆయనకు ఇచ్చిన స్థానం తాము ఊహించి జరిగింది కాదన్నారు. అది తమ మధ్య తండ్రి కొడుకుల బంధంగా బల పడింది పేర్కొన్నారు. కె.బాలచందర్‌ తనకు చాలా విషయాలు చెప్పారని, మరెన్నో ఎన్నో విషయాలను నేర్పించాలని అన్నారు. తమ కీర్తి సజీవంగా ఉన్నంతవరకు కె.బాలచందర్‌ కీర్తిప్రతిష్టలు సజీవంగా ఉంటాయని కమలాసన్‌ పేర్కొన్నారు. ఎందుకంటే తాము ఆయన పట్టుకున్న బొమ్మలు పేర్కొన్నారు. కె.బాలచందర్‌ ఒక పెద్ద నక్షత్ర కూటాన్నే సినిమాకు పరిచయం చేశారని కమలహాసన్‌ పేర్కొన్నారు.

నా కీర్తికి కారణం ఆయనే..
కాగా నటుడు రజినీకాంత్‌ తన గురువు కె.బాలచందర్‌ 90 జయంతి సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ ఈరోజు తన గురువు 90వ జయంతి అని అన్నారు. ఆయన నటుడిగా తనను పరిచయం చేయకపోయినా తాను కచ్చితంగా నటుడిని అయ్యేవాడిని అని అన్నారు. కన్నడ భాషలో విలన్‌ గానో, లేదా చిన్న చిన్న పాత్రలతో నటిస్తూ చిన్న నటుడిగా కొనసాగేవాడినని అన్నారు.అయితే ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం కె.బాలచందర్నే అని అన్నారు.  ఆయన తనకు పేరు మార్చి తనలోని మైనస్‌ లను పోగొట్టి ప్లేసులు ఏమిటన్నది తనకు తెలియచెప్పి ఒక పరిపూర్ణ నటుడిగా తీర్చిదిద్దారు అని అన్నారు. వరుసగా చిత్రాలు ఒప్పందం చేసుకొని మంచి పాత్రలు ఇచ్చి ఒక స్టార్‌ నటుడిగా తమిళ పరిచయం చేశారని అన్నారు. తన జీవితంలో అమ్మ,నాన్న ,అన్నయ్య ఆ తర్వాత స్థానంలో కె.బాలచందర్‌ ఉంటారని అన్నారు. ఈ నలుగురు నాకు 4 దైవా లు అని పేర్కొన్నారు.తనతో పాటు మరెందరో నటీనటులకు జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు కే.బాలచందర్‌ అని అన్నారు. తాను ఎందరో దర్శకుల చిత్రాల్లో పని చేశానన్నారు. ఇండియాలో ప్రముఖ దర్శకులు సుభాష్‌ ఘాయ్‌ భీమ్‌ సింగ్‌ ,కృష్ణన్‌ సుబ్బు, మణిరత్నం, శంకర్‌ వంటే పలువురు దర్శకత్వంలో నటించాలని చెప్పారు . అయితే  బాలచందర్‌ షూటింగ్‌ సెట్లోకి రాగానే తనలాంటి వారితో పాటు లైట్‌ బాయ్‌ వరకు లేచి నిలబడతారు అని అన్నారు. అలాంటి ఒక గంభీరమైన దర్శకుడిని ఎక్కడా చూడలేదని రజనీకాంత్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు