షాకింగ్‌ : ఆన్‌లైన్‌లో లీకైన 2.ఓ

29 Nov, 2018 19:40 IST|Sakshi

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో ఎస్‌ శంకర్‌ దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన 2.ఓ అన్ని రికార్డులను తిరగరాస్తూ అత్యధిక థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఈ మూవీ తొలిరోజు భారీ కలెక్షన్లను కొల్లగొట్టగా, మూవీ మేకర్లను షాకింగ్‌కు గురిచేస్తూ సినిమా పూర్తి హెచ్‌డీ ప్రింట్‌ను పైరసీ వెబ్‌సైట్‌ తమిళ్‌రాకర్స్‌ లీక్‌ చేసింది. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్దిగంటలకే హెచ్‌డీ ప్రింట్‌ పూర్తిగా లీక్‌ కావడం నిర్మాతలు, రజనీ అభిమానులను కలవరపరిచింది.

సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ఈ తరహా పైరసీ వెబ్‌సైట్ల జాబితాతో మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఆన్‌లైన్‌ పైరసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాతలు ఇన్ని ఏర్పాట్లు చేసినా సినిమా లీక్‌ కావడం దుమారం రేపుతోంది. పలు పైరసీ వెబ్‌సైట్లను ప్రభుత్వం బ్లాక్‌ చేసినా తమిళ్‌రాకర్స్‌ను బ్లాక్‌ చేయలేదు.

ఇదే వెబ్‌సైట్‌ గతంలో ధనుష్‌ నటించిన వడచెన్నై, విజయ్‌ హీరోగా తెరకెక్కిన సర్కార్‌ మూవీలను లీక్‌ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సెల్‌ఫోన్‌ల నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ దుష్ర్పభవాల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు