పండగ ముందే వస్తోంది

26 Oct, 2018 01:29 IST|Sakshi
రజనీకాంత్‌

‘రోబో’ సినిమాలో ‘చిట్టి’ రజనీకాంత్‌ దీపావళి పండగ రాక ముందే ‘హ్యాపీ దీపావళి’ అంటూ తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై బులెట్స్‌ వర్షం కురిపిస్తాడు. ఈ సీక్వెల్‌ ద్వారా కూడా అలానే పండగ రాకముందే దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి రెడీ అవుతున్నారట. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘2.ఓ’. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించారు.

లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయిక. ‘2.ఓ’ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్‌ 3న రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చే స్తోందట. దీపావళి పండక్కి ఐదారు రోజుల ముందే ట్రైలర్‌ వస్తే రజనీ అభిమానులు ముందే పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆలస్యం కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నవంబర్‌ 29న రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘పేట్టా’ సినిమా పూర్తి చేశారు. సంక్రాంతికి విడుదల కానుందని టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు